జీ.జీ.హెచ్. మెస్స్ కార్మికుల సమస్యలమీద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ధర్నా ఉద్దేశించి సీ.ఐ.టీ.యూ. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు వై. శంకర్, ఏ. ఏడుకొండలు మాట్లాడుతూ.. జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్లకు 2 నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వడం లేదని పండగ సమయంలో కూడా కార్మికులు వేతనాలు లేకుండానే పనిచేశారని అన్నారన్నారు. మెస్ వర్కర్లుగా 25 సంవత్సరాలు పైబడి నుంచి పనిచేస్తూ ఉన్న చాలా మంది కాంట్రాక్టర్లు మారారని కాని ఇటువంటి కాంట్రాక్టర్ ని ఎప్పుడు చూడలేదని అన్నారు.
పీ.ఎఫ్. కటింగ్ అయిన సొమ్మును పీ.ఎఫ్. అకౌంట్ కి జమ చేయకుండా తమ దగ్గర పెట్టుకుని కార్మికులను ఇబ్బందులుకు గురి చేస్తున్నారనన్నారు. అనంతరం డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నిమ్మ గడ్డ బుల్లి రాణి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం. వెంకటరమణ, వై. శ్రీనివాస్, ఎస్.కె శ్రీనివాస్, టి వీరబాబు, ఏ వీరభద్రరావు, కే సురేష్, దుర్గ, తదితరులు పాల్గొన్నారు

