గణాధిప సంకష్ఠ హర చతుర్ధి సందర్భంగా భోగిగణపతిపీఠంలో సోమవారం ఉదయం సహస్ర నామ పారాయణ లక్ష వత్తులతో అఖండ హారతి నిర్వహించారు. విఘ్నేశ్వర విగ్రహకవచ రూపశిల్పి విశ్వకర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మాఘ మాసం నుండి ప్రతినెల సంకష్టహర చతుర్ధి రోజున రాత్రి వేళలో జరిగే అఖండ హారతి అనంతరం చతుర్ధి ఉపవాసకులకు అల్పాహార ఏర్పాటుతో బాటుగా గణపతికి ధారణ చేసిన పట్టుశేష వస్త్రాలు మహిళలకు సిద్ది బుద్ది పూజల్లో కలశారాధన చేసిన పసుపు కుంకుమ రవిక గాజులతో తాంబూలాల ప్రదానం జరుగుతుందని తెలియజేశారు.
చతుర్ధిగణపతికి అఖండహారతి…

