రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని చెప్పారు. ఇప్పటివరకూ కేసీఆర్ అధికారమే శాశ్వతమని నమ్మారని, కాని ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడనుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

