Political

వైసీపీ ఇసుక దోపిడీ పై సీ.పీ.ఐ. అందోళన…

IMG-20231123-WA0027

వైసీపీ పాలనలో ఇసుక మాపియా అక్రమాలు పెట్రిగిపోతున్నాయని అదేవిధంగా ఈ మధ్యన మరల ఇసుక ధరలు పెంచారని దీనిపై భవన నిర్మాణ కార్మిక సంఘాలతో చర్చించి దశలు వారి పోరాటం చేస్తామని సీ.పీ.ఐ. అధ్వర్యంలో జిల్లా కలెక్టరెట్ లో అందోళన చేస్తామని దీనిని అన్ని వర్గాలు వారు జయప్రదం చేయాలని సీ.పీ.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపినిచ్చారు . సీ.పీ.ఐ. జన చైతన్య యాత్ర నాలుగవ రోజు జాంపేట, లక్ష్మీవరపు పేట ప్రాంతాలలో జరిగింది . దీనికి ముఖ్య అధితిగా పాల్గున్న మధు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం లో మద్యం ,ఇసుక అక్రమాలు సెలయేరుల పారుతున్నాయని అన్నారు.

నగరం లో అనేక ప్రజా సమస్యలు సీ.పీ.ఐ. శ్రేణులకు ప్రజల వివరిస్తున్నారని అన్నారు . ముఖ్యంగా వర్షం వస్తే డ్రెనీజీ వ్యవస్థ లేక మురికి కూపంగా వార్డ్ లు ఉన్నాయని అన్నారు. కోటిపల్లి బస్ స్టాండ్ మాదిరిగా నగర నాలుగు వైపులా లోకాల్ బస్ స్టాండ్ లు నిర్మిం చాలని మధు అన్నారు. ఈ సమావేశములో జట్ల సంగము అధ్యక్షులు కుండ్రాపు రాంబాబు, నగర కార్యదర్శి వి. కొండలరావు , రైతు సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి కె జ్యోతి రాజు, తదితరులు పాల్గున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.