– ఎమ్మెల్యే పొన్నాడకు యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌కు రాజకీయం అంటే ఏమిటో ముందు ముందు చూపిస్తానంటూ యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మాస్‌వార్నింగ్ ఇచ్చారు. యానాంలో జరిగిన ఓ కార్యక్రమంలో మల్లాడి మాట్లాడుతూ తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న “బర్రెలక్క” అలియాస్ శిరిషా కు ఆర్థిక సహాయం ప్రకటించి వార్తల్లోకెక్కిన మల్లాడి మరోసారి మాస్ ఛాలెంజ్‌తో కొత్త చర్చకు తెరలేపారు

