Education / Career

శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవం…

WhatsApp Image 2023-11-14 at 8.37.57 PM
 పెద్దాపురం రామారావు పేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో (స్కూలొంపిక్స్) బాలల దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రవికుమార్ గారు విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ… పిల్లల్లో ఉన్న వివిధ నైపుణ్యాలను వెలికి తీయడానికి వారి భవిష్యత్ కు బాటలు వేయడానికి ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు దోహద పడతాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సంతానంగారు మాట్లాడుతూ… ప్రతీ విద్యార్ధీ చలికాలం అని భావించకుండా ఆటలలో నైపుణ్యం సాధించాలని ఆ శారీరక శ్రమ ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుందని అన్నారు. 
శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ శ్రీ సీ.హెచ్. విజయ్ ప్రకాష్ గారు మాట్లాడుతూ… నేటి చిన్న పిల్లలందరూ భవిష్యత్తులో గొప్పవారు అవుతారని ఇప్పుడు గొప్పవారిగా ఉన్నవారంతా ఒకప్పటి చిన్నపిల్లలేనని, ఎవరైతే కష్టపడి చదువుతారో వారు ఉన్నతస్థానాలు అధిరోహిస్తారని విద్యార్ధి నిరంతరం ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉండాలని అప్పుడే భవిష్యత్తులో రాణిస్తారని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అకడమిక్ అండ్ కల్చరల్ కో ఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గొన్నారు.     
Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన