అంబేడ్కర్ కోనసీమ జిల్లా యానాం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. పల్సర్ బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఇటుకల లోడు తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టారు. వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే… మృతులు తాళ్లరేవు మండలం రచ్చ వారి పేట కు చెందిన వారాని తెలుస్తుంది. ఓలేటి శ్రీను (28), ఓలేటి రాజు(26), ఎదుర్లంక గ్రామం రామాలయం పేట కు చెందిన పాలేపు ప్రసాద్(24) ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆ ప్రమాదంలో తాళ్లరేవు రచ్చావారి పేటకు చెందిన రచ్చా శ్రీను కు తీవ్ర గాయాలు. తీవ్ర గాయాలు పాలైన రచ్చ శ్రీనును ఆసుపత్రికి తరలించిన పోలీసులు…

