
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 మంది బలిదానాలతో ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని పరిరక్షించుకోవటం అందరి భాద్యతని టిఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు సూచించారు.. విశాఖ ఉక్కు … ఆంధ్రుల హక్కు నినాదం దిక్కులు పిక్కటిల్లేలా అప్పట్లో విశాఖ ఖర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నామని, వేలాది మందికి ఉద్యోగాలు, పరోక్షంగా లక్షలాది మందికి వ్యాపార, ఉపాది, ఉద్యోగ మార్గాన్ని చూపిన విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని కాపాడుకోవాలని ఆయన హితవుపలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ఖర్మాగార ప్రైవేటీకరణకే కంకణం కట్టుకున్నాయని, వేలాది మంది ఉద్యోగులను రోడ్డన నెట్టేందుకు కేంద్రం ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. టిఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బతి ఫణేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దమన నీతికి ఇదొక నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విశాఖ ఉక్కు ఉద్యమ సంఘీభావ నిసన అమలాపురంలో చేపట్టారు.
