సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం లో పంచాయితీ నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్‌తో సహా ఐదుగురిని సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను జిల్లా పంచాయితీ అధికారి, కలెక్టర్ అందజేశారు. మాజీ సర్పంచ్ వల్లేరి శేష వేణి భర్తను, ప్రస్తుత సర్పంచ్ చిల్లి ఎంకటలక్ష్మి, ఆమె భర్తను పీ.డబల్యు.డీ. ఆపరేటర్ మన్యాల సత్యనారాయణ సామర్లకోట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. వేట్లపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు రూ.3.40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు నివేదికలో పేర్కొన్నారు.
నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్ అరెస్ట్…

