ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ మండల స్థాయి అధికారులకు సూచించారు. 22 మండలాల తాసిల్దార్లు, ఎం.పీ.డీ.వో. లు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ అంశాల సన్నద్ధత పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ధాన్యం రవాణాకు వినియోగించే వాహనాలన్నిటిలో జీ.పీ.ఎస్. సిస్టం అందుబాటులో ఉండాలని ఆమే అన్నారు.
లేని పక్షంలో దాన్యం సరఫరా చేసిన రైతుకు దాన్యం సొమ్ములు జమ కావని ఆమె స్పష్టం చేశారు. కావున ప్రతి వాహనాన్ని అన్ని ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 524 వాహనాలు దాన్యం రవాణా కొరకు రిజిస్ట్రేషన్ , జీ.పీ.ఎస్. సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు స్వయంగా రైతు క్షేత్రాలలో కల్లాల వద్దకు వెళ్లి నాలు గైదు చోట్ల ధాన్యం రాశుల్లో శాంపు ల్స్ ను సేకరించి శాస్త్ర యుక్తంగా పరీక్షలు నిర్వహించి కచ్చితంగా తేమ శాతాన్ని నిర్ధారించాలని స్పష్టంచేశారు.
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

