Trending News

అమలాపురం సబ్‌ డివిజన్‌లో సెక్షన్‌ 30 అమలు…

IMG-20231101-WA0006

అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉన్నట్టు డీఎస్పీ అంబికా ప్రసాద్‌ తెలియజేశారు. ఈ నిబంధన 30 నవంబర్‌ 2023 వరకూ అమలులో ఉంటుందని వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు జరపరాదని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్టైతే శిక్షార్హులవుతారన్నారు. ప్రత్యేకంగా ఈ నిబంధన 1) అమలాపురం టౌన్, 2) అమలాపురం తాలూకా, 3) అల్లవరం, 4) ఉప్పలగుప్తం, 5) ముమ్మిడివరం, 6) ఐ. పోలవరం, 7) కాట్రేనికోన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు వర్తిస్తుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రజానీకం సహకరించవలసిందిగా ఆయన కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్