కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి(డీ.పీ.వో.)గా నూతనంగా నియమితులైన కే. భారతి సౌజన్య జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కాకినాడ, కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియలను మర్యాదపూర్వకంగా కలిశారు. 2022 గ్రూప్-1 పరీక్షలో డీ.పీ.వో. గా ఎంపికైన భారతి సౌజన్య నెల్లూరు జిల్లాలో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా డీ.పీ.వో. గా ఆమెను నియమించింది.
కాకినాడ జిల్లా డీపీవో గా భారతి సౌజన్య…

