
కడప జిల్లా ప్రొద్దుటూరు మెడినోవా ఆసుపత్రి సర్కిల్ ప్రధాన రోడ్డు పై శనివారం మధ్యాహ్నం రెండు వర్గాలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుచరుడు బెనర్జీ కి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఇరువర్గాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐ నరసయ్యకు గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బెనర్జీ సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

