విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు గత 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తుంది. 2023 చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను కాకినాడ ఆర్.జె.డి. శ్రీమతి జి. నాగమణి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్ని పాఠశాలలు ఈ సైన్స్ సంబరాలు జయప్రదం కావడానికి సహకరించాలని, తద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు సహకరించాలని కోరారు.
జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… ఈ పరీక్ష జూనియర్ (6, 7 తరగతులకు), సీనియర్స్ (8, 9, 10) స్థాయిల్లో పాఠశాల స్థాయి నవంబరు 10వ తేదిన జరుగుతుందని, మండల స్థాయి నవంబరు 30 నా జరుగుతుందని జిల్లా స్థాయి డిసెంబరు 17న కిర్లంపూడి నందు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక (ఆం.ప్ర.) కాకినాడ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.ఎమ్.ఎమ్. ఆర్. ప్రసాద్, వి. శ్రీరామారావు, చెకుముకి కన్వీనర్ వర్మ, జిల్లా కార్యదర్శులు బీ.వీ.వీ. సత్యనారాయణ, ఎమ్. రామకృష్ణ, ఎన్.వి. పద్మావతి మరియు కే. ఈశ్వర రావు , సర్వ శిక్ష అభియాన్ చామంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జన విజ్ఙాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయండి… -కాకినాడ ఆర్.జె.డి. జి. నాగమణి-

