
పెద్దాపురం సీఐ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పెద్దాపురం స్టేషన్ కు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు ఎస్ఐలను నియమించాల్సి ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కాకినాడ ఎస్పి సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి, సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
