
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసినట్టుగా చెబుతున్న లెటర్‌పై పెద్ద దుమారం రేగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన లెటర్‌ను రాశారంటూ ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని సారాంశమేమనగా… నేను జైలులో లేను, మీ అందరి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను. విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నను. ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మద్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల నా ప్రజా జీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్తానం అంతా తెలుగు ప్రజల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం… అంటూ ప్రారంభించిన ఆ లెటర్ జైలు నుంచి బయటకు ఎలా వెల్లిందనేది అధికార వర్గంలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆ లెటర్ చంద్రబాబునాయుడు రాసిందికాదని, ఎవరైనా లెటర్ రాయాలంటే ముందుగా జైలు అధికారుల అనుమతి తప్పనిసరని జైల్ వార్డర్ స్పష్టం చేశారు.
