
జిల్లాలో కలకలం రేపుతున్న “నకిలీ స్టాంప్ పత్రాలు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్ పత్రాల మోసాల ముఠా”కు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై జిల్లా ఎస్పీ మలిక గర్గ్ శుక్రవారం సిట్ టీంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.., మొత్తం అన్ని కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించి బాధితులకు న్యాయం చెయ్యాలని సిట్ అధికారులుకు ఆదేశాలిచ్చారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 16 నకిలీ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్ మోసాలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులు, సిబ్బంది మరింత వేగంగా దర్యాప్తు కొనసాగించాలన్నారు. దోషులు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షల నుంచి తప్పించుకోకుండా చూడాలని కోరారు. ఆయా కేసుల్లో దర్యాప్తు పురోగతి, నిందితుల గుర్తింపు, అరెస్ట్ లపై ఆరా తీసి, సంబంధిత సీడీ ఫైల్స్ ను క్షుణ్ణంగా పలిశీలించి, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
