ఢిల్లీ లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనలో విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం మరియు పౌర పరిపాలన విఫలమైందని సుప్రీంకోర్టు విమర్శించింది. ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థుల మృతిపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఈరోజు నోటీసులు జారీ చేసింది. పౌర మరియు అగ్నిమాపక భద్రతా నియమాలను ఉల్లంఘించిన భవనంలో ఉన్న రాజిందర్ నగర్ కోచింగ్ సెంటర్ యొక్క వరదలున్న నేలమాళిగలో ఆశావహులు మునిగిపోయారని తెలిపింది. విచారణ సందర్భంగా కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని, వాటిని డెత్ ఛాంబర్స్ గా అభివర్ణిస్తూ.. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని కోర్టు విమర్శించింది.
కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై కఠినంగా విమర్శించిన సుప్రీంకోర్ట్…

