హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలి మేఘాల పేలుడు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది, ఇప్పటివరకు 8 మంది మరణించగా, దాదాపు 53 మంది అదృశ్యమయ్యారు. ఫ్లాష్‌ఫ్లడ్‌ల తర్వాత వచ్చిన క్లౌడ్‌బర్స్ట్ మొత్తం గ్రామాన్ని తుడిచిపెట్టిందని నివేదికలు చెబుతున్నాయి. జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదికల ప్రకారం కులు, సిమ్లా, మండి ప్రాంతంలో విధ్వంసం జరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్.డి.ఆర్.ఎఫ్., ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, ఇండియన్ ఆర్మీ, హోంగార్డులు ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్‌బర్స్ట్ లో 8 మంది మృతి…