హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత రాజధాని ప్రాంతంలో నాల్గవ నగరంగా ముచ్చెర్లను అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెట్టుబడులు, వినోదం, క్రీడలు, విద్యాసంస్థలకు ఇది గమ్యస్థానంగా నిలుస్తుందని, హైదరాబాద్‌కు భవిష్యత్తుగా నాల్గవ నగరం అవుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడుతూ.. ముచ్చెర్లను హెల్త్ హబ్‌గా మార్చేందుకు ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, క్రీడా విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించి వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా అద్భుతమైన నగరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
హైదరాబాద్‌కు నాల్గవ నగరం ముచ్చెర్ల… -తెలంగాణ సీ.ఎం.-

