కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు పలచబడకుండా చూసుకోవాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్.డి.ఎ. అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలు ఆదివారం మధ్యాహ్నం దేశ రాజధానిలో ముగిశాయి.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకు చెందిన 13 మంది సీ.ఎం. లు, ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన ఐదుగురు డిప్యూటీ సీ.ఎం. లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పీ.ఎం.-సీ.ఎం. సెల్ కన్వీనర్ మీడియాతో మాట్లాడుతూ.. పాలనపై ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపైనే చర్చ జరుగుతుందన్నారు.

