చట్ట ప్రకారం తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ జనరల్‌ను ఆదేశించాలంటూ వై.ఎస్.ఆర్.సీ.పీ. అధినేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జూలై 30 వాయిదా వేసింది. జస్టిస్ సీ. రవి ముందు పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జగన్ పిటిషన్‌కు ఎటువంటి మెయింటెనబిలిటీ లేదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. ఈ కేసును తానే స్వయంగా వాదిస్తానని వాయిదా వేయాలని కోరారు. ఆయన అభ్యర్థనను అంగీకరిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు.
ఈ విషయంపై ఇప్పటికే శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారని, అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి అసెంబ్లీలో ప్రతిపక్షనేత అవసరమని జగన్ నొక్కివక్కాణించారు. ఈ కేసులో స్పీకర్ విచక్షణాధికారాలను అనుమతించవద్దని, రాజ్యాంగ నిబంధనలను వర్తింపజేయాలని ఆయన హైకోర్టును కోరారు. ప్రజల గొంతును మ్యూట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రతిపక్ష నేత హోదాను నిరాకరించిందని వైఎస్ఆర్సి చీఫ్ ఆరోపించారు.

