Exclusive

ద్వారకలో స్పైడర్ మ్యాన్ అరెస్ట్…!!!

th (1)

స్పైడర్‌ మ్యాన్‌ వేషంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని ఎల్హి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ద్వారకా రోడ్డులో జరిగిందని, అక్కడ వ్యక్తి కారు బానెట్‌పై కూర్చొని కనిపించాడని పోలీసులు చెప్పారు. కారుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా అందిన ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అరెస్టు చేశారని వెళ్లడించారు. స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తి నజఫ్‌గఢ్‌కు చెందిన 20 ఏళ్ల ఆదిత్యగా గుర్తించారు. వాహనం డ్రైవర్, మహావీర్ ఎన్‌క్లేవ్‌కు చెందిన 19 ఏళ్ల గౌరవ్ సింగ్‌పై కూడా అభియోగాలు మోపారు. ఆదిత్య మరియు సింగ్ ఇద్దరూ ప్రమాదకరమైన డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడపడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఉల్లంఘనలకు జరిమానాలు గరిష్టంగా రూ. 26,000 మరియు/లేదా జైలు శిక్ష పడే అవకాశంముందని అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.