బుధవారం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ సమయంలో రన్‌వే నుండి జారిపడి మంటల్లో ఒక చిన్న విమానం చిక్కుకుపోయింది. ఆ ప్రమాదంలో 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు సంభందిత అధికారలు తెలిపారు. అయితే పైలట్‌ను ఆ మంటలనుంచి రక్షించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానిక క్యారియర్ శౌర్య ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఈ విమానం నిర్వహణ తనిఖీల కోసం ఇద్దరు సిబ్బంది, 17 మంది సాంకేతిక నిపుణులను పోఖారా నగరానికి తీసుకువెళుతున్నట్లు విమానాశ్రయ భద్రతా చీఫ్ అర్జున్ చంద్ ఠాకూరి తెలిపారు.
నేపాల్ లో మంటల్లో పడిన విమానం… 18 మృతి…
