Political

శానస మండలి సభ్యునిగా పిడుగు హరిప్రసాద్ ప్రమాణస్వీకారం…

26be4c06-1944-47a0-a5f6-8012a827a070

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన జనసేన అధ్యక్షులు రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ సోమవారం ఉదయం మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయిన అనంతరం శాసన మండలి ఛైర్మన్ మోషెన్ రాజు, హరిప్రసాద్ తో ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమం మండలి చైర్మన్ గారి ఛాంబర్ లో నిర్వహించారు. అనంతరం శాసన మండలి ఛైర్మన్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో హరిప్రసాద్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.