రాజస్థాన్లోని బికనీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిశ్చలంగా ఉన్న ట్రక్కును కారు వచ్చి వేగంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. బికనీర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాజన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మృతులంతా హర్యానాలోని దబ్వాలీ నివాసితులుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్లోని దబ్వాలీ నుంచి బికనీర్కు వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. దీని ప్రభావంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఎమర్జెన్సీ రెస్పాండర్లు కారు శిథిలాలను కోసి మృతదేహాలను వెలికి తీయాల్సి వచ్చింది.
