ఉత్తరప్రదేశ్‌లోని గోండా-మాన్కాపూర్ సెక్షన్లో చండీగఢ్-దిబ్రూగఢ్‌కు చెందిన 10 కోచ్‌లు పట్టాలు తప్పిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. భారతీయ రైల్వేలను పీడిస్తున్న భారీ లోపాలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని ఖర్గే అన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం.
ప్రధాని మోదీ స్వీయ ప్రచారానికి పూనుకున్నారని ఖర్గే ఆరోపించారు. యూ.పీ. లో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం, మోడీ ప్రభుత్వం క్రమపద్ధతిలో రైలు భద్రతను ఎలా ప్రమాదంలోకి నెట్టింది అనేదానికి మరో ఉదాహరణన్నారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి, ప్రార్థనలు క్షతగాత్రులకు ఉన్నాయని ఆయన ఎక్స్‌లో రాశారు.
