ఈ నెల 20 న జరగనున్న ది రాజమండ్రి ఆర్యాపురం బ్యాంకు ఎన్నికల్లో అనేక అవనీతి ఆరోపణులు ఎదుర్కొటున్న చల్లా శంకరావు ఎన్డీఏబెల్ట్ ను ఓడించాలని సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపు నిచ్చారు. సోమవారం ఉదయం జట్ల సంఘం మేస్త్రీ ల సమావేశము కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా పాల్గున్నా మధు మాట్లాడతూ… చల్లా శంకరావు పాలన కాలంలో చట్ట వ్యతిరేకంగా సన్నిహితులకు పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వడంలో బ్యాంకు నష్టాల బాట పట్టిందని అన్నారు
అందరిని కలుపుకుని రాజకీయం చేయకుండా అధికార రాజకీయ ఏకపక్షంగా చేయడం వల్ల చల్ల వైకిరితో బ్యాంకు తీవ్ర నష్టలోకి వెళ్లిందని అన్నారు. చల్లా శంకరావు తప్పుడు నిర్ణయాలు వల్ల సహకార చట్టం ప్రకారం సెక్షన్ 51 ఎంక్వేరీ లో దోషిగా తేలిపోయిందని, అటువంటి చల్లాను బ్యాంకు మెంబర్స్ ఓడించాలని మధు పిలుపు నిచ్చారు.

