Exclusive

నేపాల్‌లో ఘోర విషాదం… నదిలోకి కొట్టుకుపోయిన రెండు బస్సులు…

nepal

నేపాల్‌లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర విషాద చోటుచేసుకుంది. మదన్-ఆష్రిత్ హైవేపై భారీ కొండచరియలు విరిగిపడటంతో 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలోకి కొట్టుకుపోయాయి. నేపాల్‌లోని సెంట్రల్ రీజియన్‌లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో భారీ వర్షాల మధ్య ఈ విపత్తు సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఖాట్మండు నుండి రౌతహత్స్ గౌర్‌కు 24 మంది ప్రయాణిస్తున్న ఏంజెల్ బస్సు వాహనం పై కొండచరియలు విరిగిపడింది. గణపతి డీలక్స్ అనే మరో వాహనంలో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన తరువాత వాతావరణం భయంకరంగా ఉన్నందున ఖాట్మండు నుండి చిత్వాన్‌లోని భరత్‌పూర్‌కు వెళ్లే అన్ని విమానాలను రోజంతా రద్దు చేసినట్లు ఒక నివేదిక పేర్కొంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.