Kakinada

వలసపాక కు అందని అర్బన్ సౌకర్యాలు…!!!

WhatsApp Image 2024-07-12 at 8.36.10 AM

కాకినాడ పరిధిలో వలసపాక ప్రాంతం ఉన్నప్పటికీ… అక్కడికి కార్పోరేషన్ పౌర సౌకర్యాలు అందక వలసపాకల ప్రగతి నిర్వీర్యం అవుతుందని స్థానిక పౌర సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వలసపాక పంచాయతీ ఆవరణలో పౌర సంక్షమసంఘం సమావేశిన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కాకినాడ పరిసర 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమితిగా ఏర్పడి ప్రభుత్వం వద్దకు దశల వారీగా ప్రజల భాగస్వామ్య ప్రణాళిక తో ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళాలని నిర్ణయించాయి.

వాటిపై ఉన్న స్టే రద్దు చేయాలని డిమాండ్ చేయాలని, 13 ఏళ్ళుగా వలసపాకల అభివృద్ధికి నోచని దిష్టి బొమ్మలా మారిందని నిరసన వ్యక్తం చేశారు. తీరంలో భారీ పరిశ్రమల ద్వారా పుష్కలంగా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం పౌరసౌకర్యా ల పెంపుదలకు అవసరమైన విలీనం చేయడం పట్ల శ్రద్ధ చూపడం లేదన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు కమిటీ ఏర్పాటు చేపట్టిందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ