ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందడానికి ఉత్తరప్రదేశ్‌లోని బీ.జే.పీ. నేతృత్వంలోని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం ఆరోపించారు. ఎక్స్‌ప్రెస్‌వేపై అందుబాటులో ఉన్న ఏర్పాట్లపై ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా సంఘటనపై దర్యాప్తు చేయాలని అన్నారు. ఉన్నావ్ జిల్లాలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మరణించగా, 19 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేసినప్పటికీ, రోడ్డు మధ్యలో వాహనాన్ని ఎందుకు నిలిపివేశారు? పార్క్ చేసిన వాహనంపై పర్యవేక్షణ ఎలా విఫలమైంది, దీనిపై విచారణ జరగాల్సి ఉందని యాదవ్ అన్నారు.
యూపీ ప్రమాదానికి బీ.జే.పీ. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం… -అఖిలేష్ యాదవ్-

