తెలంగాణను మచిలీపట్నం పోర్టును కలిపే హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్.హెచ్.ఏ.ఐ. చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్‌ను నిర్మించాలని యోచిస్తున్నామని కనెక్టివిటీ కోసం ఎక్స్‌ప్రెస్‌వే అవసరమని ఆయన చెప్పారు. ఎన్.హెచ్.ఏ.ఐ. సభ్యుడు అనిల్ చౌదరి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిశారు. సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ముఖ్యమంత్రి కార్యదర్శి షానవాజ్ ఖాసీం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ వే కోసం అధికారులతో రేవంత్‌రెడ్డి సమావేశం…

