ముంబై BMW హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న నిందితుడు శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల ముందు అతను తన విలాసవంతమైన కారును ద్విచక్ర వాహనంపై ఢీకొట్టి ఒక మహిళను చంపడమే కాకుండా ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచాడు. ఆదివారం ఉదయం నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న మిహిర్ షా ను ముంబై సమీపంలోని విరార్ నుంచి అరెస్టు చేశారు. మిహిర్ షా తల్లి, ఇద్దరు సోదరీమణులను థానే జిల్లాలోని షాహాపూర్ నుంచి విచారణ నిమిత్తం ముంబైకి తీసుకొచ్చారు. వీరితో పాటు మరో 10 మందిని విచారిస్తున్నట్లు ఓ అధికారిని ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ తెలిపింది.
BMW హిట్ అండ్ రన్ కేసు నిందితుల అరెస్ట్…

