ఉత్తరప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నావ్ దగ్గర లక్నో నుంచి ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై వెళ్తున్న మిల్క్ ట్యాంకర్ను అటువైపుగా వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్తలానికి చేరుకున్నారు. అక్కడ పడివున్నమృత దేహాలను, గాయ పడిన వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని ఒక అధికారి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లో మిల్క్ ట్యాంకర్ బస్సు ఢీ…
