రాష్ట్రంలోని పలు పట్టణాలు నగరాలు గ్రామాల్లో డయేరియా ప్రబలమైనందున స్మార్ట్ సిటీలో డివిజన్ల వారీగా త్రాగు నీరు పరీక్షలు నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. పలు ప్రాంతాల్లో 40 శాతం కుళాయి గొట్టాలు మురుగు కాలువల్లో ఉన్నాయన్నారు. అత్యధిక ప్రాంతాల్లో 25 శాతం లీకేజీ సమస్య లున్నాయన్నారు. త్రాగు నీరు లేత ఆకుపచ్చ రంగులో చేరడం వలన అవస్థలున్నాయన్నా రు. ఇప్పటికే క్లాస్ ఏరియాల్లో మధ్య తరగతి నివసిస్తున్న ప్రాంతాల్లో బయటి మార్కెట్ నుండి సురక్షిత నీరు రోజువారీ కొనుక్కుంటున్న స్థితి కొనసాగుతున్నదన్నారు.
రోడ్ల మీద బండ్లు ఈట్ స్ట్రీట్ హోటల్స్ టీ బంకులు మున్నగు వాటిల్లో ఆహారంతో బాటుగా మంచినీరు కొనుకోవాల్సిన ధరా వస్థ వుందన్నారు. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ త్రాగు నీటి సరఫరా గతం వలె సురక్షితంగా లేకపోవడం వలన నగరంలో 50 శాతం మంది మున్సి పల్ వాటర్ వాడడం లేదన్నారు. పేద, సామాన్య ప్రజలు నివాసంవున్న ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్, డంపింగ్ వాహనాల కేంద్రాలు డ్రైనేజీ ఔట్ లెట్ మేజర్ కాలువలు వున్నందున ఆయా ప్రాంతాల్లో సురక్షిత పారిశుద్ధ్యం ప్రజలకు లభించడం లేదన్నారు.

