మండుతున్న హీట్ వేవ్ నుండి ఉపశమనాన్ని కలిగించేందుక నేడు ఢిల్లీ, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షపాతం కురిసింది. ఢిల్లీ ఎన్.సి.ఆర్. లోని వివిధ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐ.ఎం.డీ. జారీ చేసిన తాజా అప్డేట్ ప్రకారం… ఉత్తర ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ మరియు సెంట్రల్ ఢిల్లీలో వచ్చే రెండు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, సెంట్రల్-ఢిల్లీ, లోనిలోని కొన్ని ప్రాంతాలలో మరియు పరిసర ప్రాంతాలలో గంటకు 20-30 కిమీ/గం వేగంతో తేలికపాటి నుండి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, గాలులు వస్తాయి. హర్యానాలోని మనేసర్, బల్లభ్‌గఢ్, సోనిపట్, ఖర్ఖోడా, మట్టన్‌హైల్, ఝజ్జర్, ఫరూఖ్‌నగర్, సోహానా మరియు పల్వాల్, ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్, బాగ్పట్, మీరట్, ఖేక్రా, మోదీనగర్, కిథోర్, పిలాఖువా, హాపూర్, గులాయోతి, సికిందరాబాదు, సికిందర్లో కూడా రావచ్చని అంచనా వేసింది. రాబోయే రెండు గంటల్లో వర్షం పడుతుంది.