గుజరాత్ ప్రభుత్వ పథకం కింద వడోదర మునిసిపల్ కార్పొరేషన్ వి.ఎం.సి. నిర్మించిన గృహ సముదాయంలో ముస్లిం మహిళకు అపార్ట్మెంట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నివాసితులు ఆ ప్రాంతం హిందువులకు మాత్రమే అని నిరసనలు చేస్తున్నారు. కేటాయించిన ఫ్లాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, రాష్ట్ర, కేంద్రం దృష్టికి తీసుకువెళతామని నిర్వాసితులు హెచ్చరించారు. తనకు ఆరేళ్ల క్రితమే ఇల్లు మంజూరు చేసినా, ఇతర నివాసితుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇళ్లలోకి వెళ్లలేకపోయామని మహిళ లబ్ధిదారు తెలిపారు.
ఈ ప్రాంతం హిందువులకు మాత్రమే…!!! -హిందు మహిళలు-

