Exclusive

మోడీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు… -తాటిపాక మధు-

41aa020f-fb28-48b1-97f2-c2616a4cf3f9

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలనే నిర్వీర్యం చేస్తున్నారని పొమ్మన లేక పొగబెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారము ఉదయం కాకినాడ రూరల్, కొవ్వాడ, చిడిగా, సామర్లకోట రాగంపేట తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. అనంతరం సభ్యత్వాలు చేర్పించారు

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కోపం వఛ్చినప్పుడల్లా ఉపాధి పధకాన్ని ఎత్తి వేస్తామని అంటున్నారని, గ్రామాల్లో ఉన్న పెత్తందారులు కూడ అదేమాట అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో ఈ పధకం రద్దు అవ్వకుండా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ పధకాన్ని కాపాడు కుంటేనే కార్మికులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని తెలిపారు.

ఉపాధి కార్మికులకు పనిదినాలు 200రోజులు పెంచాలని, కూలి రేట్లు రూ. 600పెంచాలని, ఫే స్లిప్ గతంలో ఇచ్ఛే విధానంగా ఇప్పుడు కూడ ఇవ్వాలన్నారు. కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఎలాంటి ఇన్సూరెన్స్ సదుపాయామూ లేదని వీరికి రూ. 5లక్షల ఇన్యూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.