ప్రస్తుత జనరల్ మనోజ్ పాండే తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్‌గా నియమితులవుతున్నారని ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించిడంతో కీలక నియామకంపై ఊహాగానాలకు తెరపడింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో విస్తృత కార్యాచరణ అనుభవం ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
జూన్ 30న జనరల్ పాండే పదవీ విరమణ చేయనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది నియామకంలో ప్రభుత్వం సీనియారిటీ సూత్రాన్ని అనుసరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని ప్రభుత్వం జూన్ 30 మధ్యాహ్నం నుండి తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

