ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని కత్రాలోని శివ్ ఖోరీ గుహ మందిరం నుండి మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక చిన్నారితో సహా తొమ్మిది మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే. వారితో పాటు 33 మంది ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 53 సీట్ల బస్సు ఆదివారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిందని అధికారులు తెలిపారు. దాడి కారణంగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, బస్సు పౌనిలోని కందా ప్రాంతం సమీపంలో లోతైన లోయలో పడిపోయిందని రియాసి ఎస్.ఎస్.పీ. మోహిత శర్మ తెలిపారు.
జమ్ము కశ్మీర్ పరిస్థితిని సమిక్షించిన మోదీ…

