రెండు నెలల భీకర ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌లో 45 గంటల ధ్యానంలోకి వెళ్లారు. నారింజ రంగు దుస్తులు ధరించిన ప్రధాని మోదీ స్వామి వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. జూన్ 1 మధ్యాహ్నం వరకు ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నట్లులు తెలిపారు. 1892లో స్వామి వివేకానంద మూడు రోజుల పాటు ధ్యానం చేసిన ప్రదేశం ఇది.
ఈ శిలలో శ్రీపాద మండపం అనే ప్రత్యేక హాలు ఉంది, ఇక్కడ పార్వతీ దేవి శివుని కోసం తపస్సు చేసిందని పురాణాలు తెలుపుతున్నాయి. సాయంత్రం 4.45 గంటలకు తిరువనంతపురం నుంచి కన్యాకుమారి చేరుకున్న ప్రధాని తీరంలోని భగవతి అమ్మన్ ఆలయానికి వెళ్లారు. అక్కడ మోదీ పార్వతీ దేవికి ప్రార్థనలు చేసారు. ఆ తర్వాత ఆలయ అధికారులు ఆయనకు దేవత యొక్క చిత్రాన్ని బహూకరించారు.

