తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను బలిగొన్న ఘటనపై రాజకీయాలు రాజుకున్నాయి. దేశ రాజధానిలో తాజా అగ్నిప్రమాదానికి ఎవరు బాధ్యులంటూ భారతీయ జనతా పార్టీ ఆప్ ప్రభుత్వంపై మండిపడింది.
ఈ సందర్బంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ… నేను ఢిల్లీలోని వివేక్ విహార్లో సంఘటనా స్థలానికి చేరుకున్నానని, ఈ హృదయ విదారక సంఘటనలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపానని అన్నారు. ఈ తీరని దుఃఖ సమయంలో మేము భాదిత కుటంబాలతో ఉంటామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేషన్ నుండి డిమాండ్ చేస్తున్నానన్నారు.

