హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోర విషాదం జరిగింది. భార్యను దారుణంగా హత్య చేసి.. స్నేహితుడి ఇంటికి వెళ్లి తన భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే… బాచుపల్లిలో కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్న నాగేంద్ర భరద్వాజ కుటుంబం కలహాలతో తన భార్య మధులతను హత్య చేసారు. స్థానికులు చూడడంతో అతడు పరారయ్యాడు.
అనంతరం తన స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లిపోయాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కత్తితో తనను తానే పొడుచుకున్నాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుదిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి రిమాండ్కు తరలించారు. జరిగిన ఘటన పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు

