మంచి నీటి సరఫరా లో కాకినాడ మునిసిపల్ అధికారులు విఫలం అయ్యారు. మంచినీల్లు లేక కాకినాడ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న మునిసిపల్ అధికారులు ఇప్పుడు ఫోన్లకు స్పందించక పోవడంతో ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెలతో మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గోడారిగుంట, సాంబమూర్తి నగర్ సిటిజన్లు సమయాత్తం అవుతున్నారు.
మంచినీల్లు లేక కాకినాడ వాసుల ఇబ్బందులు…

