ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ గ్రాఫిటీ రాసినందుకు గాను 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాజీవ్ చౌక్, పటేల్ నగర్ మెట్రో స్టేషన్ల గోడలపై బెదిరింపులు రాసి ఉండటాన్ని గుర్తించామని, ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అంకిత్ గోయల్‌ను బరేలీలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ… ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ, బీ.జే.పీ. ని టార్గెట్ చేసింది. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి కుట్ర జరిగిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్…

