యూ.పీ. లోని భారతీయ జనతా పార్టీ కి ఎనిమిది సార్లు ఓటు వేసిన వీడియో వైరల్ కావడంతో అమన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఎటా నుండి అరెస్టు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పోలింగ్ పార్టీ సభ్యులందరినీ స్టేషన్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్ట్ అయిన యువకుడిని ఎటా జిల్లాలోని ఖిరియా పమరన్ గ్రామానికి చెందిన రాజన్ సింగ్‌గా గుర్తించారు. ఫరూఖాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ సంఘటన నమోదైందని అధికారులు తెలిపారు. ఆదివారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నారు.
యుపిలో ఓటు వేసిన వీడియో కేసులో అమన్ అరెస్ట్…

