మే 20వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి షోపియాన్, అనంత్‌నాగ్‌లలో జరిగిన ఉగ్రదాడుల్లో భారతీయ జనతా పార్టీ మాజీ సర్పంచ్ మరణించారు. అంతేకాకుండా ఒక పర్యాటక జంటకు తీవ్ర గాయలయ్యాయి.
అనంత్‌నాగ్‌లోని యన్నార్‌లో జైపూర్‌లో నివాసముంటున్న ఫర్హా అనే మహిళ, ఆమె జీవిత భాగస్వామి తబ్రేస్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుందని జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసులు ఒక నివేదికలో తెలిపారు.
