సింగపూర్‌లో కొత్త కోవిడ్-19 వేవ్ కలకలం రేపుతుంది. మే 5 నుండి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసుల నమోదు కావడంతో సింగపూర్ కొత్త కోవిడ్ -19 వేవ్‌ను చూస్తోందని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ శనివారం హెచ్చరించారు. మళ్లీ ముసుగులు ధరించాలని అందరికి సూచించారు. మేము కొత్త వేరియంట్ యొక్క ప్రారంభ భాగంలో ఉన్నామని, ఇక్కడ అది క్రమంగా పెరుగుతోందని ఓంగ్ చెప్పారు. కాబట్టి వచ్చే రెండు నుండి నాలుగు వారాల్లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేసారు.
సింగపూర్‌లో కొత్త కోవిడ్-19 వేవ్… 25,900 కేసులు నమోదు…
