ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలే సవాల్ విసురుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ గానీ, నాయకుడు గానీ సవాల్ విసరడంలేదన్నారు. మోదీ అజేయుడు కాడని, ఈ ఎన్నికల్లో ప్రజలు చూస్తున్నారన్నారు. ఆయన్ను ప్రతిపక్షాలు సవాల్ చేసినా చేయకున్నా ప్రజలు ఆయనకు సవాల్ విసిరారని ఒక ఇంటర్వ్యూలో కిషోర్ అన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండవచ్చు కానీ ప్రభుత్వ వ్యతిరేకత బలహీనంగా ఉండదన్నారు. 60 కోట్ల మందికి పైగా ప్రజలు రోజుకు ₹ 100 కంటే ఎక్కువ సంపాదించని దేశంలో, ఆ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఎప్పటికీ బలహీనపడదన్నారు.
ప్రజలే మోదీకి సవాల్ విసురుతున్నారు… -ప్రశాంత్ కిషోర్-

