ఢిల్లీలోని దీప్ చంద్ బంధు హాస్పిటల్, జి.టి.బి. హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెడ్గేవార్ హాస్పిటల్‌తో సహా పలు ఆసుపత్రులకు మంగళవారం బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. దానితో సంబందిత అధికారులు సోదాలు చేస్తున్నారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు మీడియాకు తెలిపారు.
ఉదయం 9.45 గంటలకు ఉత్తర ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి మొదటిగా కాల్ చేసారని వారు తెలిపారు. రెండవ కాల్ నైరుతి ఢిల్లీలోని దబ్రిలోని దాదా దేవ్ హాస్పిటల్ నుండి ఉదయం 10.55 గంటలకు, మూడవది 11.01 గంటలకు తూర్పు ఢిల్లీలోని ఫార్ష్ బజార్‌లోని హెడ్గేవార్ హాస్పిటల్ నుండి మరియు నాల్గవ కాల్ 11.12 గంటలకు తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని GTB హాస్పిటల్ నుండి వచ్చిందన్నారు.

